సినిమాలకు హీరో విక్రమ్ గుడ్ బై..?

గత కొంతకాలం గా హిట్ లేని విక్రమ్ ..ప్రస్తుతం అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో ‘కోబ్రా’.. ‘The King Cobra has Arrived’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడులా చేసి ఆసక్తి రేపారు.

ఈ ఫస్ట్ లుక్ ఏడు డిఫరెంట్ గెటప్స్‌లో విక్రమ్ కనబడి షాక్ కు గురిచేసారు. ఇంతకుముందెన్నడూ కనిపించని సరికొత్త గెటప్స్‌లో ‘కోబ్రా’లో కనిపిస్తున్నాడు చియాన్. ఇదిలా ఉంటె తాజాగా ఈ సినిమా తర్వాత విక్రమ్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నట్లు వార్తలు వైరల్ కావడం తో అభిమానులంతా షాక్ లో పడ్డారు. ఈ వార్తల ఫై విక్రమ్ పీఆర్ టీం క్లారిటీ ఇచ్చింది. విక్రమ్ తరపు నుండి ఒక ప్రెస్ నోట్ ను కూడా విడుదల చేసి అసలు విషయాన్ని చెప్పారు.ఆయన నుండి ఇంకా ఎన్నో హిట్ చిత్రాలు వస్తాయి. కొడుకుతో కూడా కలిసి నటించేందుకు ఆయన ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అని తెలుపడం తో అభిమానులంతా హమ్మయ్య అనుకుంటున్నారు.