కష్టకాలంలోనూ ఇండియాదే రికార్డు అటున్న ఆర్బీఐ

కష్టకాలంలోనూ భారత్ తన ముద్రను వేసుకుంటుందట. ప్రపంచం అంతా కలవరపాటుకు గురవుతున్న కరోనా గురించే ఇదంతా. కరోనా కాలంగా ప్రభావితం అవుతున్న సమయంలో కూడా భారతీయులు తమ రికార్డును సొంతం చేసుకుంటారని తేల్చారు ఆర్బీఐ పెద్దాయన శక్తికాంతదాస్. కరోనా ప్రభావం నేపథ్యంలో ఆసి యా దేశాల వృద్ధిరేటు ఈ ఏడాది సున్నా గా ఉండొచ్చని ఐఎంఎఫ్ అంచనా వేసింది. 1960 తర్వాత ఆసియా-పసిఫిక్ దేశాల జీడీపీ ఎన్నడూ లేనంత గడ్డు పరిస్థితులను ఎదుర్కోబోతున్నదని చెప్పింది. దీనిపై ఆర్బీఐ గవర్న్ స్పందిస్తూ అంత కష్టాలు ఎదురైనప్పటికీ భారత్ 1.9 వృద్ధి రేటును నమోదు చేసుకుంటుందని తెలిపారు.

ప్రస్తుత మహమ్మారి వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది మైనస్ మూడు శాతానికి పడిపోనున్నట్లు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంచనా వేసింది.  ఇది 2008-09లో వచ్చిన ఆర్థిక సంక్షోభం కన్నా దారుణంగా ఉన్నట్లు తన రిపోర్ట్ లో పేర్కొంది. ఈ ఏడాది రెండవ అర్థభాగంలో మహమ్మారి నుంచి కొంత విముక్తి ఉన్నా…ప్రగతి అంతగా కనిపించడంలేదని ఐఎంఎఫ్ చీఫ్ ఎకానమిస్ట్ గీతా గోపినాత్ తెలిపారు. ఐఎంఎఫ్ అంచనాల నేపథ్యంలో జీ-20 దేశాలను పేర్కొంటూ భారత్ పనితీరు మెరుగ్గా ఉంటుందని ఆర్ బీఐ గవర్నర్ ధీమా వ్యక్తం చేశారు. భారత్ వృద్ధి రేటు 1.9% ఉంటుందన్న అంచనాలు ఒకవేళ నిజమైనప్పటికీ ఇది జీ-20 మిగతా దేశాలతో పోలిస్తే ఎక్కువేనని ధీమా వ్యక్తం చేశారు. ఇది జపాన్ – జర్మనీ ఉమ్మడి ఆర్థిక వృద్ధి కంటే అధికమేనని పేర్కొన్నారు.

మరోవైపు ఐఎంఎఫ్ సైతం భారత్ విషయంలో సానుకూలత వ్యక్తం చేసింది. అయితే ఆసియా పేరుతో ఈ నివేదిక వెలువరించింది. ప్రపంచ ఆర్థిక మాంద్యంలోనూ ఆసియా దేశాల వృద్ధిరేటు 4.7 శాతంగా ఉందని – చివరకు ఆసియా ఆర్థిక సంక్షోభంలోనూ 1.3 శాతం వృద్ధి నమోదైందని గుర్తుచేసింది. అయినప్పటికీ ఇతర ప్రాంతాలతో పోల్చితే త్వరగా ఆసియా కోలుకుంటుందన్న ఆశాభావాన్ని కనబరిచింది.ఆసియాలోని మిగతా దేశాల ఆర్థిక వృద్ధి కంటే భారత్ ముఖ్యమైన సంగతి తెలిసిందే.