కేటీఆర్ “ఫ్యాషన్ షో “చూసి జనం నవ్వుకుంటున్నారు

  • మంత్రులు వాళ్ల ఇళ్లుాడిస్తే రోగాలు పారిపోవు
  • పారిశుద్ధ్య కార్యక్రమాలు మెరుగు పర్చండి
  • వెంటనే వైద్య, పారిశుద్ధ్య సిబ్బందిని భర్తీ చేయండి
  • పల్లె పల్లెన పారిశుద్ధ్య సదుపాయాలు కల్పించండి
  • ప్రభుత్వ ఆస్పత్రులను పరిపుష్టం చేయండి: జై స్వరాజ్ పార్టీ డిమాండ్

ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్ర శేఖర్రావు గారు కొరోనా తో కలిసి కరాళ న్రుత్యం చేయడానికి సీజనల్ వ్యాధులు సిద్ధం అవుతున్నాయి. గత సంవత్సరం సీజనల్ వ్యాధులతో ప్రజలు కొద్ది బాధలు పడలేదు. గ్రామ గ్రామం విలవిలలాడింది. అనేక మంది చనిపోయారు. లక్షలాది మంది అనారోగ్యం పాలై కోట్లాది రూపాయలు ప్రైవేట్ ఆస్పత్రులకు ఖర్చు చేసి అప్పుల పాలైన సంగతి మీరు మరిచినా జనం మరవలేదు. దాని నుంచి తేరుకునే లోపే కొరోనా కమ్మింది. ఇది కొనసాగుతుండగానే మళ్లీ సీజనల్ వ్యాధుల కాలమొస్తోంది. ఇప్పుడైనా సోయితో ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయండి.

ఆరోగ్య సిబ్బందిని వెంటనే భర్తీ చేయండి:

గ్రామంలోని ఆరోగ్య కేంద్రం నుంచి ఉస్మానియా ఆస్పత్రి స్థాయి వరకు ఉన్న అన్ని ఆస్పత్రులలోని వైద్య సిబ్బంది ఖాళీలను తక్షణమే భర్తీ చేయండి.

మందులు, ఇతర సదుపాయాలను కల్పించండి:

రాష్ట్రంలో గాంధీ ఆస్పత్రి నుంచి హెల్త్ సెంటర్ వరకు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. మందులు, వైద్య పరికరాలు లేక పోవడం, పారిశుద్ధ్య లోపం ఇలా అనేక సమస్యలకు నిలయంగా ప్రభుత్వ ఆస్పత్రులు ఉన్నాయి. మీ మిత్రపక్షం ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేనే గాంధీ ఆస్పత్రి గురించి చెప్పిన మాటలు మీరు అంత తొందరగా మరిచిపాతారనుకోను. వెంటనే ప్రభుత్వ ఆస్పత్రులను పరిపుష్టం చేయండి.

ఇప్పటికీ పారిశుద్ధ్య కార్యక్రమాలు సరిగా లేవు:

కొరోనా యుద్ధంలో పారిశుద్ధ్య కార్మికులు వారి ప్రాణాలకు తెగించి పని చేస్తున్నా అనేక సమస్యలతో వారు ఇబ్బంది పడుతున్నారు. సిబ్బంది కొరత, సదుపాయాల లేమి చాలా స్పష్టంగా ఉన్నాయి. గ్రామాలలో పారిశుద్ధ్య కార్మికులు లేరు. దోమల నివారణ కోసం చేసే ఫాగింగ్, బ్లీచింగ్ వంటి పనులు నగర ప్రజలకే అందడం లేదు. ఇక పల్లెల పరిస్థితి చెప్పనక్కరలేదు. ప్రస్తుతం కొరోనా కారణంగా ఆయా ప్రాంతాల్లో కొద్దిగా ఈ పనులు నడుస్తున్నాయి. ఇప్పటికైనా ప్రజా ఆరోగ్యానికి విలువ ఇచ్చి పారిశుద్ధ్య పనుల కోసం నిధులు కేటాయించి, అవి అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలి. లేక పోతే కొరోనాతో సీజనల్ వ్యాధులు జత కలిస్తే తీవ్ర నష్టం జరుగుతుంది .

ఈ సమయంలో కేటీఆర్ ఫ్యాషన్ షోలా?:

ఈ పనులు చేయడానికి కావాల్సిన కార్యాచరణపై సమాలోచనలు చేయకుండా మునిసిపల్ మంత్రి ఫ్యాషన్ షో పెట్టడం, డూ డూ బసవన్నల వలే మిగతా మంత్రులు పోటీపడి ఆకిలూకి, చానిపిజల్లి, ముగ్గులేసి ఫోటోలకు ఫోజులిచ్చిరి. దీని కోసమేనా మంత్రులున్నది? ఇంత కన్నా గొప్ప వార్తలు లేవన్నట్లు మీడియా హెడ్ లైన్ వార్తల్లో చూపించె. మునిసిపల్ మంత్రి చెప్పితేగాని మంత్రులు ఇళ్లు శుభ్రం చేయించుకోవడం లేదా? వీళ్లను చూసి ప్రజలు స్ఫూర్తి పొందాలనడం మూర్ఖత్వం. ఇన్నాళ్లు జనం ఇళ్లను శుభ్రం చేసుకోవడం లేదా? ఇంత సీరియస్ సమయంలో ఈ ఛాలెంజ్ లేంటి? జనం నవ్వుకుంటున్నారు. ఇలాంటి సినిమా నటనలాపించి ప్రజారోగ్య పరి రక్షణ కోసం ముఖ్యమంత్రి తక్షణమే చర్యలు చేపట్టాలని జై స్వరాజ్ పార్టీ డిమాండ్ చేస్తోంది.