జూన్‌ 4న కృష్ణా బోర్డు సమావేశం

★ కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టుల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్న నేపథ్యంలో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు కృష్ణా బోర్డు ప్రకటించింది.

★ హైదరాబాద్‌ జలసౌధలో జూన్‌ 4వ తేదీన ఉదయం 11 గంటలకు బోర్డు సమావేశం కానుంది.

★ ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలకు కృష్ణా బోర్డు సభ్యకార్యదర్శి పరమేశం సమాచారం అందించారు.

★ రాష్ట్రంలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్ఎల్‌బీసీ సామర్థ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం పెంచిందని.. వాటికి అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి లేదని ఏపీ ప్రభుత్వం చేసిన కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

★ దీంతో ఏపీ ప్రభుత్వం తన ఫిర్యాదులో పేర్కొన్న అంశాలకు సంబంధించిన వివరాలను సమర్పించాలని తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శికి ఇప్పటికే బోర్డు లేఖ రాసింది.

★ ఏపీ ఫిర్యాదు నేపథ్యంలో ప్రాజెక్టుల వివరాలు సమర్పించాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

★ పాలమూరు-రంగారెడ్డి, డిండి, భక్తరామదాసు, తుమ్మిళ్ల ఎత్తిపోతల, వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టుల సమగ్ర వివరాలు, ప్రాజెక్టుల డీపీఆర్‌లు సమర్పించాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని కృష్ణా బోర్డు ఆదేశించింది.

★ ఇవే కాకుండా మరే ఇతర అంశాలపైన సమావేశంలో చర్చించాల్సి ఉంటే.. ప్రతిపాదనలు పంపిచాలని ఇరు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు ఇప్పటికే లేఖ రాసింది.