తమిళ రొమాంటిక్ మూవీలో మెగా డాటర్ నిహారిక

తెలుగు తెరపై కథానాయికగా మంచి మార్కులు కొట్టేసిన నిహారిక, తమిళ ప్రేక్షకులకు కూడా కొంతకాలం క్రితమే పరిచయమైంది. కొంత గ్యాప్ తరువాత తమిళంలో చేయడానికి ఆమె సిద్ధమవుతోంది. అయితే ఈ సారి అక్కడ ఆమె చేయనున్నది రొమాంటిక్ సినిమా కావడం విశేషాన్ని సంతరించుకుంది.

హీరోగా .. నిర్మాతగా తమిళంలో అశోక్ సెల్వన్ కి మంచి క్రేజ్ వుంది. ఆయన కథానాయకుడిగా ఒక రొమాంటిక్ మూవీ సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతోంది. ఈ సినిమాలో నిహారిక ఆయన జోడీ కట్టనుంది. లేడీ డైరెక్టర్ స్వాతి ఈ సినిమాకి దర్శకత్వం వహించనుంది. గోవా బీచ్ కి సంబంధించిన సీన్స్ .. లిప్ లాక్ సీన్స్ ఈ సినిమాలో వుంటాయని నిహారిక స్వయంగా చెప్పింది. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
Tags: Niharika, Ashok, Ashok Selvan, niharika tamil movie project