Take a fresh look at your lifestyle.

మంత్రి వెల్లంపల్లిని వెంటనే బర్తరఫ్ చేయాలి: దేవినేని ఉమ

0 7

విజయవాడ:  మంత్రి వెల్లంపల్లిని వెంటనే బర్తరఫ్ చేయాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈవో బాధ్యతా రాహిత్యంగా మాట్లాడుతున్నారన్నారు. సింహాలు పోయాయని క్లియర్‌గా కనిపిస్తుంటే ఇంకా ఈవోని మంత్రి వెనకేసుకొస్తున్నారన్నారు. ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ఆపకుండా వైసీపీ ప్రభుత్వం రాజకీయాలు మాట్లాడుతోందన్నారు.ఐఏఎస్ స్థాయి అధికారిని మార్చి ఎందుకు కింద స్థాయి అధికారిని ఈవోగా తీసుకువొచ్చారని దేవినేని ఉమ పేర్కొన్నారు. వెంటనే ఈవోని సస్పెండ్ చేసి ఒక పూర్తి స్థాయి జ్యూడిషల్‌ని దర్యాప్తు చేయాలన్నారు. ఈ 16 నెలల్లో జరిగిన అన్ని ఘటనలపై సీబీఐతో విచారణ జరిపించాలన్నారు. దేవాలయాలు, చర్చి, మసీదులపై దాడులను టీడీపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. నిందితులను కాపాడాలనే ప్రయత్నం ఇక్కడ అధికారులు, మంత్రి చేస్తున్నారన్నారు.రాష్ట్రంలో అన్ని ప్రముఖ దేవాలయాలలో ఇలాంటి దాడులు జరుగుతుంటే ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుందని దేవినేని ఉమ పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (0) in /home/realher1/public_html/wp-includes/functions.php on line 4669