Take a fresh look at your lifestyle.

mod documents: చైనాపై డాక్యుమెంట్ తొలగించిన రక్షణ శాఖ: నిజాలను మార్చలేరంటూ కాంగ్రెస్

0 33

[ad_1]

చైనా దురాక్రమణలపై..

చైనా దురాక్రమణలపై..

అయితే, తాజాగా, రక్షణ శాఖ వెబ్‌సైట్‌లో ఆ డాక్యుమెంట్ కనిపించకపోవడం విమర్శలకు దారితీసింది. వాస్తవధీన రేఖ(ఎల్ఏసీ) వెంబడి చైనా ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా మే 5, 2020 నుంచి గల్వాన్ లోయలో చైనా మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. అంతగాక, కున్‌గ్రాంగ్ నాలా, గోగ్రా, పాంగ్యాంగ్ సరస్సు పరిసర ప్రాంతాల్లో మే 17, 18 మధ్య చైనా దురాక్రమణలకు పాల్పడిందని ఆ డాక్యుమెంట్‌లో పేర్కొంది.

తొలగింపుపై సమాచారం లేదు..

తొలగింపుపై సమాచారం లేదు..

‘ఎల్ఏసీలో చైనా దురాక్రమణ’ అనే శీర్షికతో ఈ డాక్యుమెంట్‌ను రక్షణ శాఖ తన అధికారిక వెబ్‌సైట్లో ఉంచింది. అయితే, దాని తొలగింపు గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని రక్షణ శాఖ అధికారి ఒకరు మీడియాకు వెల్లడించడం గమనార్హం. ఆ డాక్యుమెంట్‌లో ఎల్ఏసీలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మొదలైన తర్వాత చైనా ఆక్రమణ గురించి అధికారికంగా పేర్కొంది. ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరు దేశాల సైన్యం మధ్య చర్చలు జరిగినట్లు తెలిపారు. గల్వాన్ లోయ ఘర్షణ గురించి కూడా అందులో ప్రస్తావించారు. ఇంకా జూన్ 6, జూన్ 22న కమాండర్ స్థాయి అధికారుల మధ్య జరిగిన చర్చ జరిగినట్లు కూడా పేర్కొన్నారు.

నిజాలు మార్చలేరంటూ కాంగ్రెస్

నిజాలు మార్చలేరంటూ కాంగ్రెస్

బలగాల ఉపసంహరణకు ఇరుదేశాల మధ్య అంగీకారం జరిగినప్పటికీ, ప్రస్తుత ప్రతిష్టంబన మరికొంత కాలం కొనసాగవచ్చని డాక్యుమెంట్‌లో తెలిపారు. తూర్పు లడఖ్ సరిహద్దు ప్రాంతంలో చైనా మరింత దూకుడుగా వ్యవహరిస్తోందని, ఈ పరిణామాలను భారత్ నిశితంగా పరిశీలిస్తోందని, సరైన సమయంలో తగిన విధంగా స్పందిస్తామని స్పష్టం చేసింది. అయితే, ఈ డాక్యుమెంట్ ఎందుకు తొలగించిందంటూ కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. దీని ద్వారా నిజాలను మార్చలేరంటూ ధ్వజమెత్తింది.

[ad_2]

Leave A Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (0) in /home/realher1/public_html/wp-includes/functions.php on line 4669