Take a fresh look at your lifestyle.

Neeli Neeli Aakasam Full Video Song: యాంకర్ ప్రదీప్ సంచలనం.. 16 కోట్ల వ్యూస్‌! – 16 crore views for neeli neeli aakasam full video song from pradeep machiraju’s 30 rojullo preminchadam ela

0 8

[ad_1]

బుల్లితెర స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా రూపొందిన ‘30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా?’ చిత్రంలోని ‘నీలి నీలి ఆకాశం’ పాట ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాటకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. యూట్యూబ్‌లో విడుదల చేసిన ఈ పాట ఫుల్ వీడియోను ఎగబడి చూశారు. ఇప్పటికీ చూస్తూనే ఉన్నారు. ఈ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది.

Also Read: రష్మికకు చుక్కలు చూపించిన హీరో.. మైండ్ ఖరాబైందట! ఎంత ‘పొగరు’?

ఈ ఏడాది ఏప్రిల్‌లో 100 మిలియన్ (10 కోట్ల) వ్యూస్‌ క్రాస్ చేసిన ఈ పాపులర్ సాంగ్.. ఇప్పటికి 16 కోట్ల మంది ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. గురువారం ఈ సాంగ్ 160 మిలియన్ మార్క్‌ను దాటింది. 200 మిలియన్ వ్యూస్ వైపు దూసుకెళ్తోంది. నిజానికి ప్రదీప్‌కు హీరోగా ఇదే తొలి చిత్రం. ఒక చిన్న హీరో సినిమాలో పాట ఈ స్థాయిలో ఆదరణపొందడం గొప్ప విషయం. స్టార్ హీరోల పాటలతో సమానంగా ఈ పాట దూసుకెళ్తోంది. దీనికి ప్రధాన కారణం సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్.. గాయనీగాయకులు సిద్ శ్రీరామ్, సునీత. అంతేకాదు, చంద్రబోస్ అందించిన సాహిత్యం మరో అద్భుతం. ఈ సినిమాలోని పాటన్నింటినీ ఆయనే రాశారు.

ప్రముఖ దర్శకుడు సుకుమార్ ద‌గ్గర ‘ఆర్య 2’, ‘1 నేనొక్కడినే’ చిత్రాల‌కు ప‌నిచేసిన మున్నా ద‌ర్శక‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని ఎస్వీ ప్రొడ‌క్షన్స్ బ్యాన‌ర్‌పై క‌న్నడ చిత్రసీమ‌లో విజ‌య‌వంత‌మైన నిర్మాత‌గా పేరుపొందిన ఎస్వీ బాబు నిర్మించారు. సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. విడుదలకు సిద్ధంగా ఉంది. థియేటర్లు తెరుచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాను జీఏ2, యువి క్రియేష‌న్స్ సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నాయి.

Leave A Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (0) in /home/realher1/public_html/wp-includes/functions.php on line 4669