ఏయిర్ హోస్టెస్ ను పెళ్లి చేసుకున్న దిల్ రాజు

  • నిన్న రాత్రి  దిల్ రాజ్ రెండో పెళ్లి
  • నిజామాబాద్ లోని ఆలయంలో జరిగిన వివాహం
  • సామాజిక మాధ్యమాల్లో వీరి పెళ్లి ఫొటోలు
  • ఏయిర్ హోస్టెస్ మెడలో మూడు ముళ్లు వేశారు
  • తన తండ్రి దిల్ రాజు పెళ్లికి పెద్దగా కూతురు హన్షిత రెడ్డి

ప్రముఖ నిర్మాత దిల్ రాజు కొత్త జీవితాన్ని ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లాలోని తన సొంతూరు నర్సింగ్ పల్లిలో వెంకటేశ్వరస్వామి గుడిలో దిల్ రాజు వివాహం నిరాడంబరంగా జరిగింది. అయితే ఈ పెళ్లి కులాంతర వివాహమని, మాతృ దినోత్సవం రోజున తన తండ్రి దిల్ రాజు పెళ్లికి పెద్దగా కూతురు హన్షిత రెడ్డి వ్యవహరించారు.

మూడేళ్ల కిందట దిల్ రాజు భార్య అనిత గుండెపోటుతో హైదరాబాద్‌లో చనిపోయారు. 2017 నుంచి దిల్ రాజు ఒంటరిగా ఉంటున్నారు. అయితే ఈ సమయంలో తండ్రికి మళ్లీ పెళ్లి చేయాలని దిల్ రాజు, అనితల కూతురు అన్షిత రెడ్డి భావించారు. ఈ క్రమంలో తన తండ్రికి రెండో వివాహం చేశారు. పెళ్లికి కొన్ని గంటల ముందు దిల్ రాజు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు.

కాగా, దిల్ రాజు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఏం చేస్తుంటుందన్న విషయాలపై నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. వీరికి పరిచయం ఉన్న ఓ బ్రాహ్మణ యువతిని దిల్ రాజు పెళ్లాడినట్లు తెలుస్తోంది. గతంలో ఎయిర్ హెస్టెస్‌గా చేశారని సమాచారం. 2014లో దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డి వివాహం ఘనంగా జరిగింది. 2017లో హన్షిత తల్లి అనిత చనిపోయారు. తండ్రికి పెళ్లి చేయాలనుకున్న హన్షిత.. దిల్ రాజు పెళ్లికి పెద్దగా వ్యవహరించి మూడేళ్ల ఆలోచనకు కార్యరూపం ఇచ్చారు.