Take a fresh look at your lifestyle.

Roja వ్యాఖ్యలు సంచలనం..ఆ చట్టంపై అవగాహన లేదన్న ప్రతిపక్షాలు

0 4

[ad_1]

లేనివి ఉన్నట్టు, ఉన్నవి లేనట్టు.. ఏపిలో అధికార పార్టీ నేతల వింత ప్రకటనలు..

లేనివి ఉన్నట్టు, ఉన్నవి లేనట్టు.. ఏపిలో అధికార పార్టీ నేతల వింత ప్రకటనలు..

రాజకీయాల్లో కొంత మంది నాయకులు చేసిన ప్రకటనలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అంతే స్ధాయిలో బ్రాండింగ్ ముద్ర కూడా ఉంటుంది. తెలంగాణలో సీఎం చంద్ర శేఖర్ రావు, కేటీఆర్, హరీష్ రావు, రేవంత్ రెడ్డి, ఏపిలో చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పార్టీకి చెందిన తులసి రెడ్డి, వైయస్సార్ సీపిలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఆర్కే రోజా వంటి నాయకులు యాదృచ్చికంగా ఏ వ్యాఖ్యలు చేయరని, వారు మాట్లాడితే ఏదో అంశం గురించి లోతైన సారాంశం ఉంటుందని జనాల్లో ముద్ర వేసుకున్నారు. అలాంటి నేతలు ఏమరుపాటుగా వ్యవహరిస్తూ ఏదైనా అంశంగురించి అవగాహన లేకుండా మాట్లడితే ఆశ్చర్యం కలగక మారదు.

తొందరాపాటా..? నిర్లక్ష్యమా..? వాస్తవానికి దూరంగా ఉంటున్న నేతల స్టేట్మెంట్లు..

తొందరాపాటా..? నిర్లక్ష్యమా..? వాస్తవానికి దూరంగా ఉంటున్న నేతల స్టేట్మెంట్లు..

ప్రజల కొన్ని విషయాలపై అవగాహనా ఉండదని అనుకుంటారో ఏమో తెలియదుకానీ… కొంత మంది నాయకులు నిర్లక్ష్యంగా వ్యాఖ్య లు చేసేస్తుంటారు.చేయని పనిని కూడా చేసినట్లు చెప్పుకుంటున్నారు. జరగని దానిని కూడా జరిగినట్లు ప్రచారం చేస్తున్నారు. తాజాగా నగరి ఎమ్మెల్యే ఎమ్మెల్యే రోజా ఇలాంటి పనే చేసింది. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఏపి సీఎం జగన్మోహన్ రెడ్దికి మహిళలపై అపార గౌరవం, అభిమానం ఉందని, వారి సంక్షేమం కోసమే దిశ చట్టం తెచ్చారని వ్యాఖ్యానించారు. వాస్తవానికి ఏపీలో దిశ చట్టం అమల్లో లేదనే అంశం పట్ల ఎమ్మెల్యే రోజాకి అవగాహన లేదని ప్రతిపక్షాలు చెబుతున్నాయి.

ప్రజాజీవితం వేరు.. వ్యక్తిగతం వేరు.. ప్రజా క్షేత్రంలో ఏమరుపాటుగా వ్యవహరిస్తే మూల్యం తప్పదు..

ప్రజాజీవితం వేరు.. వ్యక్తిగతం వేరు.. ప్రజా క్షేత్రంలో ఏమరుపాటుగా వ్యవహరిస్తే మూల్యం తప్పదు..

ఏపీలో దిశ పేరిట మహిళ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయడంతో మహిళలకు సంబంధించిన కేసులను త్వరిత గతిన పరిష్కరించేందుకు ఇక్కడ చర్యలు తీసుకుంటారు. ప్రస్తుతం దిశ పేరు పెట్టారు గాని మహిళలకు ప్రత్యేకంగా ఎప్పట్నుంచో పోలీసు స్టేషన్లు ఉన్నాయి. కానీ దిశ పేరు పెట్టగానే జగనే వాటిని కొత్తగా పరిచయం చేసినట్టు రోజా చెప్పుకొచ్చారని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. అంతే కాకుండా మొన్న నర్సీపట్నం లో అయ్యన్నపాత్రుడిపై పెట్టిన కేసులు కూడా నిర్బయ చట్టానికి లోబడి పెట్టినవే. మరి దిశ చట్టం ఉండగా నిర్భయ కేసులు ఎందుకు పెట్టారనే ప్రశ్న కూడా ఉత్పన్నమైంది. దిశ చట్టం అనేది ఇంకా ఏపీలో అమల్లోకి మాత్రం రాలేదు. ఇదే అంశం పట్ల అవగాహన లేకుండా రోజా వ్యాఖ్యానించారనే చర్చ జరుగుతోంది.

ఏపీలో రూపుదాల్చని దిశ చట్టం.. దిశ చట్టం అమలవుతోందని నిర్ధారించిన ఎమ్మెల్యే రోజా..

ఏపీలో రూపుదాల్చని దిశ చట్టం.. దిశ చట్టం అమలవుతోందని నిర్ధారించిన ఎమ్మెల్యే రోజా..

ఏపి శాసన సభలో సీఎం స్వయంగా ప్రకటన చేసినప్పటికి చట్టం ఇంకా రూపు దాల్చలేదు. కానీ రోజా మాత్రం ‘దిశ చట్టం’ అమలులో ఉన్నట్టు, సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదిశగా అడుగులు వేసినట్టు స్పష్టం చేసారు. ప్రతిపక్ష పార్టీ హోదలో ఉన్న టీడీపీ శ్రేణులు కూడా ఈ చట్టం కార్యరూపం దాల్చిందా లేదా అనే అవగాహన లేకపోడం శోచనీయం. కొన్ని సందర్బాల్లో ప్రశ్నించాల్సిన మీడియా కూడా మౌనం వహిస్తుండ టంతో ఇలాంటి ప్రకటనలు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి . చట్టం తెలిసిన వాళ్లు పరిశీలించి ప్రశ్నిస్తేగాని రోజాలాంటి నాయకులు నాలుక కరుచుకోరు. అప్పటి వరకూ అవగాహనా రాహిత్యంతో వారు చేసిన ప్రకటనలు వాడివేడిగా సోషల్ మీడియిలో షికార్లు చేస్తూనే ఉంటాయి.

[ad_2]

Leave A Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (0) in /home/realher1/public_html/wp-includes/functions.php on line 4669