Take a fresh look at your lifestyle.

Samsung Galaxy M21: గొప్ప తగ్గింపు ధరలతో మొదలైన సేల్స్… | Samsung Galaxy M21 Start Receiving Price Cut After Increase GST Rates

0 47

[ad_1]

శామ్‌సంగ్ గెలాక్సీ

ఈ ఫోన్‌ను మార్చిలో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ట్రిపుల్ రియర్ కెమెరా వంటి అద్భుతమైన ఫీచర్లతో మూడు కలర్ లలో లాంచ్ చేశారు. లాక్ డౌన్ సమయలో ఆరెంజ్ మరియు గ్రీన్ జోన్లలో తమ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి ఇ-కామర్స్ కంపెనీలను ప్రభుత్వం అనుమతించిన సందర్భంగా ఈ ఫోన్ మీద ధర తగ్గింపును పొందింది.

ఇండియాలో శామ్‌సంగ్ గెలాక్సీ M 21 ధరల వివరాలు

ఇండియాలో శామ్‌సంగ్ గెలాక్సీ M 21 ధరల వివరాలు

ఇండియాలో శామ్‌సంగ్ గెలాక్సీ M21 ను రెండు వేరియంట్‌లలో లాంచ్ చేసింది. ఇందులో 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ.13,499 ధర వద్ద మరియు 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ.15,499 ధర వద్ద మొదట లాంచ్ చేసారు. మొబైల్స్ ఫోన్ల మీద GST రేట్లను పెంచడం వల్ల వీటి యొక్క ధరలను సంస్థ పెంచింది. ఫలితంగా వీటి యొక్క ధరలు రూ.14,222, రూ.16,499 లకు పెరిగాయి. కొత్తగా ఇప్పుడు వీటి మీద ధరలను తగ్గించడంతో ఇందులో గల రెండు వేరియంట్‌లు వరుసగా రూ.13,199, మరియు రూ. 15,499 ధర వద్ద లభిస్తున్నాయి.

గెలాక్సీ M21 ను ఆన్‌లైన్‌ సేల్స్

గెలాక్సీ M21 ను ఆన్‌లైన్‌ సేల్స్

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆరెంజ్ మరియు గ్రీన్ జోన్‌ల ప్రాంతంలో నివసిస్తున్న వినియోగదారులు మాత్రమే శామ్‌సంగ్ గెలాక్సీ M21 ను ఆన్‌లైన్‌లో కొనడానికి అవకాశం ఉంటుంది. రెడ్ జోన్లలో నివసించే వారు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వేచి ఉండాలి. స్వతంత్ర దుకాణాలు మరియు నివాస కాలనీలలో ఉన్న వాటిని మాత్రమే తెరవడానికి అనుమతించడంతో పట్టణ ప్రాంతాల్లో భౌతిక దుకాణం కూడా మూసివేయబడింది.

Tata Sky, Dish TV అందిస్తున్న లోన్ ఆఫర్స్ & వివిధ రకాల ఉచిత ఆఫర్స్…

కరోనావైరస్ - స్మార్ట్ఫోన్

కరోనావైరస్ – స్మార్ట్ఫోన్

కౌంటర్ పాయింట్ రీసెర్చ్ యొక్క తాజా నివేదిక ప్రకారం 2020 క్యూ 1 లో కరోనావైరస్ కారణంగా భారతదేశంలో స్మార్ట్ఫోన్ల రవాణా 4 శాతం పెరిగింది. పూర్తి క్యాలెండర్ సంవత్సరానికి మొత్తం 10 శాతం క్షీణత నివేదికలో అంచనా వేయబడింది. గెలాక్సీ ఎం 21 కోసం ఇటీవల ధరల తగ్గింపు ఫోన్‌ల అమ్మకాలపై కరోనావైరస్ ప్రభావాన్ని తగ్గించడానికి శామ్‌సంగ్ యొక్క వ్యూహాలలో ఒకటి.

Aarogya Setu Appను ఉద్యోగులందరిని డౌన్‌లోడ్‌ చేయవలసిందిగా ఆదేశించిన ప్రభుత్వం

స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్

డ్యూయల్ సిమ్ (నానో) సిమ్ స్లాట్ గల శామ్‌సంగ్ గెలాక్సీ M 21 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 10 ఆధారిత వన్ UI2.0 తో రన్ అవుతుంది. 6.4-అంగుళాల ఫుల్-హెచ్‌డి + డిస్‌ప్లే 1080×2340 పిక్సెల్స్ పరిమాణంలో ఉండి ఇన్ఫినిటీ-యు సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే 19.5: 9 కారక నిష్పత్తితో మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో వస్తుంది.

కెమెరా సెట్ -అప్

కెమెరా సెట్ -అప్

శామ్‌సంగ్ గెలాక్సీ M 21 స్మార్ట్ ఫోన్ వెనుక వైపు ట్రిపుల్ రియర్ కెమెరా సెట్ -అప్ ను కలిగి ఉంటుంది. ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ ఫోటోలను తీయడానికి మరియు వీడియోలను రికార్డ్ చేయడానికి సెటప్ చేయబడి ఉంది. అలాగే 123-డిగ్రీల అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ యొక్క 8 మెగాపిక్సెల్ సెన్సార్‌తో సెకండరీ కెమెరా మరియు 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో మూడవ కెమెరా జతచేయబడి ఉంటుంది. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం దీని ముందు భాగంలో 20 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది. సెల్ఫీ కెమెరా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఫీచర్లతో పనిచేస్తుంది.

కనెక్టివిటీ

కనెక్టివిటీ

శామ్సంగ్ గెలాక్సీ M21 స్మార్ట్ ఫోన్ 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 512GB వరకు విస్తరించవచ్చు. కనెక్టివిటీ ఎంపికలలో 4 G VoLTE, వై-ఫై, బ్లూటూత్, జిపిఎస్ / ఎ-జిపిఎస్, యుఎస్బి టైప్-సి మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ కూడా వస్తుంది. ఫోన్‌లోని ఇతర సెన్సార్లలో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్, గైరో, మాగ్నెటోమీటర్ మరియు సామీప్య సెన్సార్ ఉన్నాయి. ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్‌ మద్దతుతో 6,000 mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఈ ఫోన్ 8.9mm మందంతో 188 గ్రాముల బరువు కలిగి ఉంటుంది.

Leave A Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (0) in /home/realher1/public_html/wp-includes/functions.php on line 4669