Take a fresh look at your lifestyle.

Sri Reddy: శ్రీరెడ్డి వల్ల కొత్త వాళ్లకి న్యాయం జరిగిందా? ఆ మాట అడిగితే చెప్పుతీసుకుని కొడతా: రాజా రవీంద్ర – actor raja ravindra about sri reddy casting couch issue

0 26

[ad_1]

టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ అనే మాట వినపడిన ప్రతిసారి వివాదాస్పద నటి శ్రీరెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే అప్పటివరకూ గుట్టు చప్పుడు కాకుండా తెరవెనుక సాగుతున్న చాలా విషయాలు ఈ ఇష్యూతో ఒక్కొకటిగా బయటకు వచ్చాయి. తాజాగా ప్రముఖ నటుడు రాజా రవీంద్ర ఈ ఇష్యూపై ఓపెన్ అయ్యారు. గ్రేట్ ఆంధ్రా యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ చందన క్యాస్టింగ్ కౌచ్ ఇష్యూని లేవనెత్తుతూ శ్రీరెడ్డి ప్రస్తావన తీసుకువచ్చారు. దీంతో రాజా రవీంద్ర శ్రీరెడ్డి పేరును ప్రస్తావించకుండానే గట్టి హెచ్చరిక ఇచ్చారు. సన్సేషన్ చేద్దాం అని నోటికొచ్చినట్లు మాట్లాడితే ఏదో రోజు ఎవడో ఒకడు యాసిడ్ పోసేస్తాడని తీవ్రంగా హెచ్చరించారు రాజా రవీంద్ర.

రాజా రవీంద్ర మాట్లాడుతూ.. టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ గురించి నేను ఆలోచించను.. ఒకవేళ నేను ఆడపిల్లనైతే ఆలోచించే వాడినేమో. అసలు క్యాస్టింగ్ కౌచ్ అంటే ఓన్లీ సినిమాలు అనే కాదు.. అమ్మాయి అంటేనే అదోరకంగా చూసే వాళ్లు ఎక్కడైనా ఉంటారు. మీడియాతో సహా గవర్నమెంట్ ఆఫీస్‌లు పోలీస్ ఆఫీసుల్లో కూడా ఇలాంటిది ఉంటాది. అయితే సినిమాల్లోనే ప్రత్యేకించి క్యాస్టింగ్ కౌచ్ అని హైలైట్ చేశారు. దేవుళ్లుగా పూజింపబడుతున్న స్వామిజీలు కూడా ఇదే ఇష్యూపై అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్తున్నారు. కాని క్యాస్టింగ్ కౌచ్ అంటే అదేదో సినిమాల్లోనే ఉన్నట్టు నొక్కి మరీ మాట్లాడుతుంటారు.

సినిమా అంటే గౌరవం ఉన్న వాడు ఎవడూ కూడా అలా బిహేవ్ చేయడు. బాగా సంపాదించేసి.. ఏదో సినిమా తీసేద్దాం.. ఎంజాయ్ చేసేద్దాం అని సినిమా గురించి అవగాహన లేని వాడు మాత్రమే ఇలా చీప్‌గా బిహేవ్ చేస్తాడు. సినిమా కాదు.. ఎక్కడైనా ఆడదాన్ని గౌరవించలేదు అంటే.. వాడు జీవితంలో పైకి రాడు. కాస్త లేట్ అవ్వొచ్చేమో కాని ఖచ్చితంగా దెబ్బ తింటాడు. ఒకవేళ ఎవడైనా అలా బిహేవ్ చేస్తే ఖచ్చితంగా ఫైట్ చేయండి. అంతేకాని మీడియా ముందుకి వచ్చి గగ్గోలు పెడితే పరువు పోగొట్టుకోవడం.. ఎదుటివాడి పరువు పోగొట్టాం అని ఆనంద పడటం తప్ప రూపాయి లాభం ఉండదు.

క్యాస్టింగ్ కౌచ్ ఇష్యూలో శ్రీరెడ్డి బయటకు వచ్చి గొడవచేసినప్పుడు ఇండస్ట్రీలో మీటింగ్‌లు జరగడం మాత్రమే కాదు.. ఒక కమిటీని కూడా వేసి.. ఐఏఎస్ ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్, యాంకర్ ఝాన్సీ, అక్కినేని సుప్రియ, నందిని రెడ్డి ఇలా కొంతమంది సభ్యులతో కమిటీ వేసి.. ఎవరికైనా సమస్య ఉంటే వెళ్లి చెప్పుకోమన్నారు. అదే సందర్భంలో ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలపైన.. పేరున్న వ్యక్తులపైన నోటికొచ్చినట్టు మాట్లాడకూడదని వాళ్ల వాళ్ల విజ్ఞ‌త మీద ఆధారపడి ఉంటుంది.

వాడు ఎదవ.. వీడు ఇదీ.. అదీ అని ఎవరు పడితే వాళ్లు మాట్లాడలేరు. వాళ్లు పెరిగిన వాతావరణాన్ని బట్టి అలాంటి మాటలు వస్తాయి. ఇలాంటి వాళ్ల మీద యాక్షన్ ఎలా తీసుకుంటారు. మీడియాను కంట్రోల్ చేయడం కుదరనన్నాళ్లు వాళ్లనీ కంట్రోల్ చేయలేం. వాళ్లు ఎవర్నైనా తిట్టొచ్చు.. ఆరోపణలు చేయొచ్చు. ఈ మధ్యన ఎవర్ని పడితే వాళ్లని ఇంటర్వ్యూలు చేస్తున్నారు. చాలా మంది యాంకర్లు వాల్యూ లేని వాళ్లతో ఇంటర్వ్యూలు చేసి వాళ్లని హైలైట్ చేస్తున్నారు. ఎవడో ఏదో అన్నాడని నువ్ అదంట కదా.. నువ్ ఇదంట కదా.. అని నన్ను అడిగితే చెప్పుతీసుకుని కొడతా.. ఇంతకు ముందు పిచ్చి ప్రశ్నలు వేస్తే ఒకడ్ని కొట్టాను కూడా.

ప్రతి ఒక్కరికీ ఒక్కో గోల్ ఉంటుంది. వాళ్లని విమర్శించలేం. వాళ్లు అలాగే బతకాలి.. అలాగే పాపులర్ అవ్వాలనే గోల్ ఉంటుంది. అలాంటి వాళ్ల జోలికి వెళ్ల కూడదు. ఇలాంటి వాళ్లని ప్రైమినిష్టర్ కూడా బాగు చేయలేడు. మన పేరెంట్స్ మనల్ని ఎలా పెంచారో.. మనం మాట్లాడే మాటల్ని బట్టి అర్థమైపోతుంది. నేను హీరో అవుదాం అని వచ్చా కాలేదు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా చేద్దాం అనుకున్నా.. ఇప్పుడు సక్సెస్ ఫుల్‌గా అదీ చేయలేకపోయా.. దీంతో ఒత్తిడిలో పిచ్చి పిచ్చిగా ఎవర్నొకర్ని ఏదోటి అంటే.. ఒకరోజు చూస్తారు రెండు రోజులు చూస్తారు తరువాత.. జనం కూడా పట్టించుకోరు. క్యారెక్టర్ లాస్ అవుతారు.

మనం సక్సెస్ కాలేదు.. ఓకే!! అప్పుడు ఎలా ఉండాలి?? ఎలా బతకాలని ఆలోచించారు. ఒకరోజు కాంట్రవర్శీ కోసం ఆలోచిస్తే.. లైఫ్‌లో దెబ్బతింటారు. ఈరోజు ఊరుకోవచ్చు.. రేప్పొద్దున్న ఎవడో యాసిడ్ పోశాడంటే.. హీరో అంటే దేవుడుగా భావించే పిచ్చ అభిమానులు ఉంటారు.. వాళ్ల హీరోని ఇష్టమొచ్చినట్టు తిట్టేవాళ్లని చూసి తట్టుకోలేక యాసిడ్ పోసేశాడంటే.. వాడు జైలుకి పోతాడు. వీళ్లు లైఫ్ లాంగ్ ఏమైపోతాడు? మీడియాలో మనల్ని చూపిస్తున్నారు కదా అని రెచ్చిపోవడం మంచి పద్దతి కాదు. వీళ్లను ఉపయోగించుకుని శవాలపై డబ్బులు సంపాదించేవాళ్లు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్లు లైఫ్‌లో ఎప్పుడో గట్టిగా దెబ్బతింటారు. నేను ఎందుకు ఈ రూటు ఎన్నుకున్నానని బాధపడే సందర్భం వస్తుంది. అవతల వాడు రియాక్ట్ అవ్వనంత వరకూ వీళ్ల ఆటలు సాగుతాయి.. అప్పటి వరకూ ఎంజాయ్ చేస్తారు.. కాని వాడు రియాక్ట్ అయితే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది’ అంటూ గట్టిగానే హెచ్చరించారు రాజా రవీంద్రా.

Leave A Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (0) in /home/realher1/public_html/wp-includes/functions.php on line 4669