Take a fresh look at your lifestyle.

sushant singh rajput death case: దిశ మరణంతో లింక్.. అందుకే సుశాంత్ అప్‌సెట్ అయ్యారు: ముంబై పోలీస్ కమిషనర్ – sushant singh rajput googled painless death, says mumbai police

0 35

[ad_1]

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై జరిపిన దర్యాప్తునకు సంబంధించిన వివరాలను ముంబై పోలీస్ కమిషనర్ పరమ్ బిర్ సింగ్ ఆగస్టు 3న నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. అలాగే, ముంబైలో బిహార్ పోలీసుల దర్యాప్తుపై వస్తోన్న విమర్శలపై కూడా ఆయన మాట్లాడారు. తన మాజీ మేనేజర్ దిశా సలియన్ మరణంతో తన పేరును ముడిపెట్టడం సుశాంత్‌ను బాగా ఇబ్బంది పెట్టిందని, ఆయన తీవ్ర ఆందోళనకు గురయ్యారని పరమ్ బిర్ సింగ్ స్పష్టం చేశారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14న ఆత్మహత్య చేసుకోగా.. ఆ సంఘటనకు ఐదు రోజుల ముందు దిశ మృతి చెందారు. ఆమెది ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా కేసు నమోదు చేశారు.

దిశ చనిపోయిన తరవాత తన గురించి మీడియాలో ఎలాంటి ఆర్టికల్స్ రాశారో తెలుసుకోవడానికి తన పేరును స్వయంగా గూగుల్‌లో సుశాంత్ సెర్చ్ చేసినట్టు కమిషనర్ చెప్పారు. తన పేరుతో పాటు ‘painless death’, ‘schizophrenia’, ‘bipolar disorder’ గురించి కూడా సుశాంత్ సెర్చ్ చేసినట్టు కమిషనర్ వెల్లడించారు. సుశాంత్ బైపోలార్ డిజార్డర్‌తో బాధపడుతున్నారని, దానికి చికిత్స కూడా తీసుకున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, దానిపై దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. ‘‘ఆరోజు రాత్రి తను చనిపోవడానికి సుమారు రెండు గంటల ముందు తన పేరును సుశాంత్ గూగుల్‌లో సెర్చ్ చేశారు’’ అని ముంబై పోలీస్ కమిషనర్ తెలిపారు.

Also Read: అర్నాబ్ – ది న్యూస్ ప్రాస్టిట్యూట్: వర్మ మరో సంచలనం.. ప్రముఖ జర్నలిస్టుపై సినిమా

‘‘దిశా సయని మరణానికి ముందు ఆ రోజు రాత్రి ఆమెకు కాబోయే భర్త ఇంట్లో పార్టీ జరిగింది. ఉదయం 3 గంటల సమయంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మేం నిర్ధారణ చేసుకున్నాం. దిశ కాబోయే భర్తతో పాటు ఐదుగురు ఆ రోజు రాత్రి పార్టీలో పాల్గొన్నారు. మిగిలిన నలుగురిలో రాజకీయ నాయకులు ఎవరూ లేరు’’ అని ముంబై పోలీస్ కమిషనర్ వెల్లడించారు. ఈ పార్టీలో రాజకీయ నాయకులు పాల్గొన్నారని వస్తోన్న వదంతులపై పై విధంగా కమిషనర్ వివరణ ఇచ్చారు.

ఇక బిహార్ పోలీసులు ముంబైలో దర్యాప్తు జరపడం గురించి కమిషనర్ మాట్లాడుతూ.. ‘‘ఈ కేసును దర్యాప్తు చేసే అధికారం బిహార్ పోలీసులకు లేదు. దీనిపై మేం లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నాం. మేం ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదు. ఆ ఫిర్యాదు (సుశాంత్ తండ్రి కేకే సింగ్ కంప్లయింట్‌ను ప్రస్తావిస్తూ) మా వరకు రాలేదు’’ అని అన్నారు. అలాగే, బిహార్ ఐపీఎస్ ఆఫీసర్ వినయ్ తివారీని బలవంతంగా క్వారంటైన్‌కు పంపారన్న ఆరోపణలపై కమిషనర్ మాట్లాడుతూ.. ‘‘ఏ అధికారిని క్వారంటైన్ చేయడంలోనూ మా పాత్ర లేదు. ఇది బీఎంసీ తీసుకున్న నిర్ణయం’’ అని స్పష్టం చేశారు.

Also Read: మంచు విష్ణు ‘మోసగాళ్ళు’.. టాప్ సీక్రెట్ రివీల్ చేసిన చిత్ర యూనిట్

అలాగే, సుశాంత్ సింగ్ ఫ్యామిలీ పాట్నాలో కేసు నమోదు చేయడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు కమిషనర్ స్పందిస్తూ.. ‘‘జూన్ 16న మాకు ఇచ్చిన స్టేట్‌మెంట్స్‌లో ఎవరిపై ఎలాంటి అనుమానం లేదని సుశాంత్ కుటుంబం పేర్కొ్ంది’’ అని వెల్లడించారు. అదే విధంగా, సుశాంత్ బ్యాంక్ ఖాతా నుంచి 15 కోట్ల రూపాయలు మాయమయ్యాయని ఆయన తండ్రి చేస్తోన్న ఆరోపణపై కూడా కమిషనర్ స్పందించారు. ‘‘ఆయన బ్యాంక్ ఖాతాలో రూ.18 కోట్లు ఉన్నట్టు మా దర్యాప్తులో గుర్తించాం. ప్రస్తుతం రూ.4.5 కోట్ల మేర ఖాతాలో ఉంది. మిగిలిన సొమ్ము ఎవరికి ట్రాన్స్‌ఫర్ అయ్యింది అనే విషయంలో దర్యాప్తు జరుగుతోంది. ఆ సొమ్ము రియా చక్రవర్తి అకౌంట్‌కు డైరెక్ట్‌గా ట్రాన్స్‌ఫర్ కాలేదు’’ అని కమిషనర్ వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (0) in /home/realher1/public_html/wp-includes/functions.php on line 4669