Take a fresh look at your lifestyle.

TDPపై రవిబాబు షాకింగ్ కామెంట్స్.. ఎన్నికల్లో యాడ్స్ చేశా, ఆ దెబ్బతో పాలిటిక్స్ అంటే బుల్ షిట్

0 11

[ad_1]

దర్శకుడు, నటుడు రవిబాబు సినిమాలు కాస్త కన్ఫ్యూజ్‌గా ఉన్నా.. ఆయన మాటలు మాత్రం చాలా ముక్కుసూటిగా ఉంటాయి. గతంలో ఆయన తెలుగుదేశం పార్టీకి ప్రచారకర్తగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో దర్శకుడు బోయపాటి శ్రీను తెలుగుదేశం పార్టీకి యాడ్స్ రూపొందించగా.. 2014లో తెలుగుదేశం పార్టీ తరపున రవిబాబు ప్రచార బాధ్యతలు తీసుకున్నారు. అయితే అప్పటి అనుభవాలను పంచుకుంటూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు రవిబాబు. తనకు వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీ అంటే ఇష్టం ఉండదు అంటూనే ఆ పార్టీపై షాకింగ్ కామెంట్స్ చేశారు.

రవిబాబు మాట్లాడుతూ.. ‘నేను అడ్వటైజ్‌మెంట్‌ నుంచి ఫిల్మ్స్‌కి వచ్చాను. ఏ ప్రాజెక్ట్ వచ్చినా చేసేవాడిని. అయితే 2014 వరకూ నన్ను పొలిటికల్ అడ్వటైజ్‌మెంట్ చేయమని నన్ను ఎవరూ అడగలేదు.. అవకాశం రాలేదు. నాకు పొలిటికల్ యాడ్స్ చేయాలనే ఇంట్రస్ట్ కూడా లేదు. అయితే 2014లో నేను ట్రై చేయలేదు కాని.. టీడీపీలో ఉన్న పెద్దాయన ఒకరు నాకు ఫోన్ చేసి.. సార్ మాకు మీరు యాడ్స్ చేయాలని అన్నాడు.. అప్పటికి ఎన్నికలకు నాలుగు నెలలు మాత్రమే ఉంది.. మీరు తప్పకుండా చేయాలని అన్నారు.

వెంటనే నన్ను మీటింగ్‌కి పిలిచారు. నేను వెళ్లి నా కాన్సెప్ట్ చెప్పాను. నాకు పర్సనల్‌గా తెలుగుదేశం పార్టీ అంటే ఇష్టం ఉండదు. నాతో మాట్లాడిన పెద్దాయన ఇంతకు ముందు సెంట్రల్ మినిస్టర్ కూడా చేశారు.. ఆయన ముందు ఇలా అన్నా.. నాకు మీ పార్టీ అంటే ఇష్టం ఉండదు సార్.. ఒకప్పుడు పేదల పార్టీగా ఉన్నది ఇప్పుడు ధనికుల పార్టీగా ఉందని అనడంతో అక్కడ ఉన్నవాళ్లు నన్ను విచిత్రంగా చూశారు. వీడ్ని ఎందుకు పిలిచారు అనుకున్నారు.

మీరు పవర్‌లో ఉన్నప్పుడు రోడ్లు వెడల్పు చేశారు.. మనుషులు నడవడానికి లేకుండా ప్లాట్ ఫాం లేకుండా చేశారు. అవి ఎవరి కోసం చేశారు కార్లు ఫ్రీగా వెళ్లడానికి చేశారు. 75 శాతం ప్రజలు నడుచుకుంటూ వెళ్తున్నారు.. వాళ్లు ఇప్పుడు ఎక్కడ నడవాలి.. రోడ్ల మీద నడవాలి. మీరు కార్లలో పోతారు. అందుకే మీ గవర్నమెంట్ అంటే నాకు ఇష్టం ఉండదని చెప్పాను. కాని చాలా ఛాలెంజింగ్ తీసుకుని టీడీపీకి యాడ్స్ చేశా. అది చేయడం వల్ల నాకు ఏం అర్థమైందంటే.. ఈ పాలిటిక్స్ అనే దానికి మనం ఎంత దూరంగా ఉంటే అంత బెటర్. ఇలాంటి మనుషులతో.. ఇలాంటి వాతావరణంలో మనం ఉండకూడదు.. పాలిటిక్స్ అంటే బుల్ షిట్ అనుకున్నా. అందుకే ఎన్నికలు అయిన తరువాత వాళ్లకి కనీసం ఫోన్ కూడా చేయలేదు. ఎవరితోనూ మాట్లాడలేదు.

అయితే 2019 ఎన్నికలకు మళ్లీ నాలుగు నెలల ముందు ఫాలోఅప్ మొదలు పెట్టారు. అమరావతి రండి సార్.. ప్లీజ్ మళ్లీ చేయండి సార్ అని అడిగారు. సారీ.. నేను చేయను. ఇది లైఫ్‌లో ఒక్కసారే చేశా.. ఇక చేయకూడదు అనుకుంటున్నా.. నేను పొలిటికల్ అడ్వటైజింగ్‌ని ఎంజాయ్ చేశా.. కాని మళ్లీ జీవితంలో టచ్ చేయను అని అక్కడితో ఆ చాప్టర్ క్లోజ్ చేసేశా. మా నాన్నగారు (చలపతిరావు) రామారావు గారికి చాలా క్లోజ్. కాని ఎప్పుడూ కూడా ఫేవర్ చేయమని అడగలేదు.

నేను టీడీపీకి యాడ్స్ చేసేటప్పుడు మూడునెలల పాటు బాబుగారితో ఇంట్రాక్ట్ అయ్యా.. అప్పుడు కూడా ఆ పార్టీపై నా అభిప్రాయం మారే టైం దొరకలేదు. సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా మందిని అడిగారు.. కాని జగన్ పవర్‌లోకి వస్తారని అందరూ భయపడ్డారు.. నేను ఒక్కడినే వెళ్లా. ఆ తరువాత కూడా చంద్రబాబుగారికి ఎప్పుడూ కలవలేదు.. ఏదో పెళ్లిలో కలిశారు కాని.. పలకరించుకోలేదు’ అంటూ తెలుగుదేశం పార్టీపైన చంద్రబాబు నాయుడుపైన ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు నటుడు, దర్శకుడు రవిబాబు.

Leave A Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (0) in /home/realher1/public_html/wp-includes/functions.php on line 4669