Take a fresh look at your lifestyle.

దాచేపల్లి వరదలు వచ్చినప్పుడల్లా మునకకు కారణం మీ పార్టీకి చెందిన రాంకీ సంస్థ నిర్వాకం వల్లే ఈ పరిస్థితి వచ్చింది.

0 56

దీని మీద దాచేపల్లి ప్రజలు అనేక సార్లు రాస్తారోకోలు, ధర్నాలు చెయ్యడం, మీ రాంకీ సంస్థ ప్రతినిధులను కూడా నిలదీయడం జరిగింది.

★ నువ్వేదో నిన్న దాచేపల్లిలో గత ప్రభుత్వ పాలకుల తప్పిదాల వల్లే ఇవన్నీ జరుగుతున్నాయని మాట్లాడావు.

★ చంద్రబాబు గారు, యరపతినేని గారు రూ.10 కోట్ల రూపాయలు రోడ్డుకు ఇస్తానని చెప్పి, ఇవ్వలేదని చెప్పి మాట్లాడవు.

★ నువ్వు ఎమ్మెల్యే అయ్యి 15 నెలలు అయ్యింది.

★ గత ప్రభుత్వ హయాంలో ఏమి పనులు చేశారో! ముందుగా తెలుసుకో.

★ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన రూ.10 కోట్లు కాకుండా ఇంకా రూ.5 కోట్లు అదనంగా రూ.15 కోట్ల రూపాయలతో దాచేపల్లిలో రోడ్లు,డ్రెయిన్లు వెయ్యడం జరిగింది.

★ కాటేడు వాగును కూడా మేమే బాగుచేయడం జరిగింది.

★ మీ రాంకీ నిర్వాకం వల్ల పైగ్రామాలైన భటృపాలెం, కాట్రపాడు, కొత్తూరు, సారంగపల్లి అగ్రహారం, మాదినపాడు గ్రామాలకి వాహనాలు కూడా పొలేని పరిస్థితుల్లో ఉంటే, మేమే రూ.2 కోట్ల రూపాయలతో దాచేపల్లి బైపాస్ రోడ్డు నిర్మించాం.

★ అది ఈరోజు దాచేపల్లి పట్టణవాసులకు వరంగా మారింది.

★ నాగులేరు బ్రిడ్జిని నిర్మించింది మేము.

★ గండివాగు లిప్ట్ ఇరిగేషన్ పూర్తి చేసింది మేము.

★ రూ.20 కోట్లతోని తంగెడ రోడ్డుని నిర్మించింది మేము.

★ రూ.15 కోట్లతోని కాట్రపాడు రోడ్డు నిర్మించింది మేము.

★ రూ.5 కోట్లతోని దాచేపల్లి ప్రధాన రహదారి సిమెంటు రోడ్డు నిర్మాణం శాంక్షన్ చేయించింది మేము.

★ రూ.6 కోట్ల రూపాయలతోని కేసానుపల్లి సిమెంటు రోడ్డు నిర్మాణం శాంక్షన్ చేయించింది మేము.

★ నాగులేరుకు రూ.4 కోట్ల రూపాయలతోని లోలెవల్ బ్రిడ్జిని శాంక్షన్ చేయించింది మేము.

★ తక్కెళ్ళపాడు – పెదగార్లపాడు రూ.3 కోట్ల రూపాయలతోని రోడ్డును శాంక్షన్ చేయించింది మేము.

★ నడికుడి – పులిపాడు రూ.3 కోట్లతోని రోడ్డు వేయించింది మేము.

★ దాచేపల్లి మండలంలో ఒక్క పుష్కరాల్లోనే రూ.50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం.

★ దాచేపల్లిలో రామాలయం, శ్రీ రంగనాయక స్వామి ఆలయం నిర్మించింది మేము.

★ కోటి రూపాయలతోని షాదీఖానాని శాంక్షన్ చేయించింది మేము.

★ బీసీ కమ్యూనిటీ హల్ కట్టించింది మేము.

★ చర్చి నిర్మాణానికి డబ్బులు ఇచ్చింది మేము.

★ రెండు వేల మందికి పట్టాలు ఇచ్చింది మేము.

★ మీ ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలు అయినా నియోజవర్గంలో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా, ఇంకా ఏదో మేము చేసాం అని, మా మీద మాట్లాడటం చూస్తుంటే మీ చేతకానితనం అర్థమవుతుంది.

★ ఇప్పటికైనా మీ రాంకీ సంస్థతో మాట్లాడి చేసిన తప్పిదాలను గుర్తించి దాచేపల్లి ప్రజల సలహాలు, సూచనలు తీసుకొని పని చేస్తే దాచేపల్లికి వరద ముప్పు తప్పుతుంది.

★ ముందు ఆ పని చెయ్యాలని చెప్పి కోరుతున్నాం.

★ వ్యక్తిగత సంపాదనపై ఉన్న ప్రేమ, ప్రజలకు ఏమి చేసావో! తెలుసుకుంటే మంచిదని హితవు పలుకుతున్నాం.

Leave A Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (0) in /home/realher1/public_html/wp-includes/functions.php on line 4669