తెలంగాణలో లాక్ డౌన్ మళ్లీ పొడిగించే అవకాశం?

  • తెలంగాణలో ఒకోరోజు ఒకో మాదిరిగా ‘కరోనా’ కేసుల సంఖ్య
  • వైరస్ ను అదుపుకు కనీసం 70 రోజుల లాక్ డౌన్ అవసరం
  • ప్రభుత్వానికి సిఫారసు చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య ఒకరోజు పెరగడం, మరోరోజు తగ్గతున్న నేపథ్యంలో లాక్ డౌన్ ను మరికొన్ని రోజుల పాటు పొడిగించే ఉద్దేశంలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ సూచన మేరకు ప్రభుత్వం ఈ దిశగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. వైరస్ ను అదుపు చేసేందుకు కనీసం 70 రోజుల లాక్ డౌన్ అవసరమని, రాష్ట్రంలో ఇంకొన్ని రోజులు లాక్ డౌన్ పొడిగించడం మంచిదని ప్రభుత్వానికి ఆరోగ్య శాఖ అధికారులు సిఫారసు చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 28 వరకు లాక్ డౌన్ పొడిగించే ఉద్దేశంలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం.
Tags: Telangana, Lockdown, Government, Medical And Health, corona pandemic