లాక్ డౌన్ బోర్: ఈ బెస్ట్ 5 సినిమాలు చూస్తే రిలీఫ్

కరోనాతో దేశంలో లాక్ డౌన్ ఈ నెలాఖరు వరకు పొడిగించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ ఒడిషా బెంగాల్ మహారాష్ట్ర రాష్ట్రాలు లాక్ డౌన్ ను ఏప్రిల్ 30వరకు పొడిగించాయి. దీంతో మరో 15 రోజులు ఇంట్లోనే. ఇన్ని రోజులు ఎవరూ ఇంటిపట్టున కదలకుండా ఉండరేమో.. అంతా బోరింగ్. దీంతో ఈ ఖాళీ టైంలో మానసికంగా కూడా పలువురు కృంగిపోతుంటారు. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరి మనసును ప్రేరేపించడం అవసరం. అందుకే ఈ సమయంలో హాలీవుడ్ 5 బెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్స్ మూవీలు చూసి ఎంజాయ్ చేయండి. లాక్ డౌన్ వేళ పెరుగుతున్న ఆందోళన ఒత్తిడి వంటి మానసిక సమస్యలను ప్రారదోలాలంటే హాలీవుడ్ లో రూపొందిన బెస్ట్ బ్లాక్ బస్టర్ సైకలాజికల్ థ్రిల్లర్స్ చూస్తే ఉపశమనం లభిస్తుంది. అవి ఏంటో తెలుసుకుందాం.

1. జోకర్ (2019)
2019లో విడుదలైన జోకర్ మూవీ మనిషి సంఘర్షణను బయటపెడుతుంది. ఎలా కష్టాల నుంచి బయటపడాలో కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. భారత్ లోనూ ఈ మూవీ రికార్డు కలెక్షన్లు సాధించింది. బతకడం ఎంత కష్టం.. ఎలా జయించాలనే దానిపై రూపొందిన ఈ మూవీ మనల్ని మానసికంగా ధృడంగా మారుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

2. గాన్ గర్ల్ (2014)
2014లో వచ్చిన ఈ సైకో థ్రిల్లర్ మూవీ పోలీసులు క్రైం ఆధారంగా తెరకెక్కింది. బతకడం ఎంత దుర్భరంగా ఉంటుంది.. ఎలా బయటపడుతారేది చూపించారు. కామిక్స్ బుక్ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ కూడా స్ఫూర్తినిస్తుంది.

3. ఎనిమీ (2013)
బౌతికంగా ఒకరు.. మరొక వ్యక్తి ప్రవర్తనలో ఎలా కనిపిస్తాడు? ప్రొఫెసర్ నటుడి మద్యలో మోసాలు జీవితంలో మలుపులతో అద్భుతంగా సాగే ఈ చిత్రం కూడా సైకాలజికల్ గా మన జీవితంలో ఎలా ధృడంగా తయారు కావచ్చో సూచిస్తుంది.

4. షటర్ ఇస్ లాండ్ (2010)
టైటానిక్ ఫేం లియోనార్డో డికోప్రాయో నటించిన ఈ హాలీవుడ్ సైకలాజికల్ థ్రిల్లర్ సైకాలజిస్ట్ జీవిత కథ ఆధారంగా రూపొందింది. మానసికంగా కృంగిపోయిన వారిని ఎలా బయటపడేసే చూపించే చిత్రం. ఇలాంటి సమయంలో ఇదే బెస్ట్ చిత్రంగా చెప్పవచ్చు.

5. బ్లాక్ స్వాన్ (2010)
టీచర్ లోని మానసికపరమైన సమస్యలు ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు. తాను చేసేది నిజమో కాదో తెలియని పరిస్థితుల్లో తనను తాను హాని చేసుకునే వారి మానసిక సంఘర్షణ అందులోంచి ఎలా బయటపడాలన్నది ఇందులో చూపించారు.

ప్రస్తుతం లాక్ డౌన్ తో ఇంట్లోనే ఇబ్బందిపడుతున్న వారిలో కలిగే మానసిక వేధనలకు విరుగుడుగా ఈ చిత్రాలను చూస్తే కాస్తా అయిన ఆలోచనల్లో మార్పు వస్తుంది. మనకంటే దుర్భరమైన జీవితాలున్నాయని.. బయటపడగలమని ధైర్యం కలుగుతుంది. సో లాక్ డౌన్ వేళ ఈ చిత్రాలు చూసి సేదతీరండి.