జూన్ 10 రాశి ఫలాలు

“జ్యోతిషం, వాస్తు, ఖగోళ శాస్త్ర విషయాలను తెలియజేసే ములుగు సిద్ధాంతిగారి తెలుగువారికి సుపరిచితులు. రాజకీయ, సినీ ప్రముఖుల భవిష్యత్తు గురించి గతంలో ఆయన వెల్లడించిన అంశాలు నిజమయ్యాయి.”

మేషం..
ఇంటా బయటా ఒత్తిడులు ఎదురై చికాకులు పెడతాయి. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండును. వస్తు లాభం సిద్ధిస్తుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టే పనిలో విఘ్నాలు కలగకుండా చూసుకోవాలి.

వృషభం..
వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. విందు, వినోదాల్లో చురుకుగా పాల్గొంటారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. అనుకోని అతిథులను కలుస్తారు. మొదలు పెట్టే పనులు, వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. కీలకమైన పనులు దైవబలంతో పూర్తి చేస్తారు.

మిథునం..
మిత్రులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆరోగ్యం, వాహనాల విషయాల్లో తగిన జాగ్రత్త అవసరం. సోదరుల నుంచి ధనలాభం పొందుతారు. తలపెట్టిన పనుల్లో తొందరపాటు పనికి రాదు. ఓర్పు చాలా అవసరం. బంధుమిత్రుల సలహాలు మేలు చేస్తాయి.

కర్కాటకం..
చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. గృహనిర్మాణ ఆలోచనలు ఫలిస్తాయి. పాతమిత్రులను కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. దూరప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఆనందం కలుగుతుంది. మీమీ రంగాల్లో అభివృద్ధి ఉంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది.

సింహం..
ముఖ్యమైన పనులు, వ్యవహారాల్లో అవరోధాలు ఏర్పడినా సన్నిహితుల సహాయం అందుకుంటారు. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. స్వల్ప ధనలాభం పొందుతారు. ఊహించని ఫలితాలు అందుకుంటారు. భవిష్యత్ ప్రణాళికలో స్పష్టత వస్తుంది.

కన్య..
సోదరుల నుంచి ఆస్తి లాభం పొందుతారు. నూతన ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. భాగస్వామ్య వ్యాపారాల్లో నూతన ఒప్పందాలు కుదురుతాయి. విందు, వినోదాల్లో అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. కొన్ని కీలక వ్యవహారాల నుంచి బయటపడగలుగుతారు. ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత కలుగుతుంది.

తుల..
ప్రయాణాలు లాభిస్తాయి. పనులు అనుకున్న విధంగా పూర్తిచేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఎవరికైనా బొబ్బట్లు దానంగా ఇవ్వండి. ప్రణాళిక బద్ధంగా ముందుక వెళ్లకపోవడం వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్యంపై అప్రమత్తత అవసరం.

వృశ్చికం..
భూవివాదాలు తీరి లబ్దిపొందుతారు. బంధువులతో ఏర్పడని విభేదాలు పరిష్కరించుకుంటారు. ప్రయాణాల్లో తొందరపాటు వద్దు. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ధనలాభం ఉంటుంది. ఆవేశాలకు పోకూడదు. అందరిని కలుపుకు పోవడం వల్ల సమస్యలు తగ్గుతాయి. శ్రమపెరగకుండా చూసుకోవాలి.

ధనస్సు..
ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. సన్నిహితుల నుంచి సహాయసాకారాలు అందుతాయి. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారం లాభించిన చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.

మకరం..
స్థిరాస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. వాహనయోగం ఉంది. విలువైన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటాబయటా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. పనులు వేగవంతంగా పూర్తవుతాయి.

కుంభం..
చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడం చాలా అవసరం. సన్నిహితుల నుంచి ధనలాభం పొందుతారు. విందు, వినదాల్లో పాల్గొంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం అవసరం. అనుకూల ఫలితాలు ఉన్నాయి .

మీనం..
మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. భూముల క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు. సోదరుల కష్ట సుఖాలను పంచుకుంటారు. ఓ శుభవార్త మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఓ వ్యవహారంలో మీ పనితీరుకు అధికారుల మెచ్చుకుంటారు. బంధువులతో అనుకూలత ఉంది.