కరోనా నుంచి కోలుకుని మరో ఇద్దరు డిశ్చార్జి

బత్తలపల్లి ఆర్డిటి ఆస్పత్రి నుంచి హిందూపురం కు చెందిన ఇద్దరు మహిళలు డిశ్చార్జి

అనంతపురం: కరోనా వైరస్ నుంచి మరో ఇద్దరు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. హిందూపురం పట్టణానికి చెందిన 17 ఏళ్ళు, 34 ఏళ్ల వయసు కలిగిన ఇద్దరు మహిళలకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో బత్తలపల్లి ఆర్డిటి ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందించగా, ప్రస్తుతం వారు కోలుకోవడంతో శనివారం సాయంత్రం డిశ్చార్జ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు.. ఇప్పటివరకు జిల్లాలో కరోనా నుంచి 94 మంది కోలుకుని ఇంటికి చేరారని తెలిపారు. 14 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్ లోనే ఉండాలని డిశ్చార్జ్ అయిన ఇద్దరు మహిళలకు సూచించామని, తదుపరి వైద్య సేవల నిమిత్తం వారికి ఒక్కొక్కరికి 2 వేల రూపాయల చొప్పున నగదు అందజేసినట్లు కలెక్టర్ తెలిపారు.