మేడ్చల్‌లో ఇద్దరు యువతుల ఆత్మహత్య

జవహర్‌‌నగర్: మేడ్చల్ జిల్లాలో ఇద్దరు యువతుల ఆత్మహత్య కలకలం రేపుతోంది. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డెంటల్ కాలేజ్ డంపింగ్ యార్డ్ సమీపంలో చెట్టుకు ఉరివేసుకుని ఇద్దరు యువతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఘటనా స్థలిలలో ఓ పాప మృతదేహం కూడా లభ్యమైనట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.