చరణ్ కోసం స్క్రిప్టు పనిలో వంశీ!

గతేడాది వచ్చిన ‘మహర్షి’ సినిమా తర్వాత తన తదుపరి చిత్రాన్ని కూడా మహేశ్ బాబుతోనే చేయాలని దర్శకుడు వంశీ పైడిపల్లి ప్లాన్ చేసుకున్నాడు. మహేశ్ కూడా అతనితో చేద్దామనే అనుకున్నాడు. అయితే, వంశీ తయారుచేసిన స్క్రిప్ట్ ఎందుకనో మహేశ్ కి నచ్చలేదట. దాంతో ఆ ప్రాజక్టు డ్రాప్ అయింది.

ఈ క్రమంలో వంశీ ఏమాత్రం అప్సెట్ అవకుండా వెంటనే రామ్ చరణ్ కోసం మరో సబ్జెక్టును తయారుచేసే పనిలో పడ్డాడు. పూర్తి యాక్షన్ తో కూడిన కథతో చరణ్ ను ఒప్పించాలనే పట్టుదలతో ప్రస్తుతం వంశీ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడని సమాచారం. త్వరలోనే పూర్తి స్క్రిప్టుతో చరణ్ ని వంశీ కలవనున్నాడని తెలుస్తోంది.

గతంలో చరణ్, వంశీ కలయికలో వచ్చిన ‘ఎవడు’ సినిమా మంచి సినిమాగా పేరుతెచ్చుకోవడమే కాకుండా, బాక్సాఫీసు విజయాన్ని కూడా సాధించింది. దాంతో ఈసారి ఈ కాంబినేషన్ లో ఎలాంటి చిత్రం వస్తుందో చూడాలి.
Tags: Vamshi, Mahesh Babu, Ramcharan, Maharshi