మహేశ్ మూవీ తరువాత రాజమౌళి ప్రాజెక్ట్ ‘మహాభారతం’?

ప్రస్తుతం రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాను పూర్తిచేసే పనిలో వున్నాడు. ఈ సినిమా తరువాత మహేశ్ బాబుతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నట్టు ఆయనే చెప్పాడు. ఆ తరువాత సినిమాగా ఆయన ‘మహాభారతం’ చేయనున్నట్టుగా ఒక వార్త వినిపిస్తోంది. ‘మహాభారతం’ సినిమాను రూపొందించడమే తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని రాజమౌళి పలు సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే.

ఇటీవల రామానంద్ సాగర్ ‘రామాయణం’ మళ్లీ ప్రసారమై, రికార్డు స్థాయి రేటింగును దక్కించుకుంది. దాంతో రాజమౌళి ‘రామాయణం’ తెరకెక్కిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని చాలామంది అభిమానులు సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేశారు. అయితే భారీ స్థాయిలో ‘రామాయణం’ నిర్మించడానికి అల్లు అరవింద్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అందువలన ‘మహాభారతం’ పైనే రాజమౌళి దృష్టిపెట్టినట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఒక ముఖ్యమైన రోల్ చేస్తాడని గతంలోనే రాజమౌళి చెప్పిన సంగతి తెలిసిందే.
Tags: Rajamouli, Junior NTR, Mahabharatham, rajamouli next project name, ramayanam movie updates, charan and jr ntr movie